శ్రీ. కార్తీకేయ మిశ్రా, (I.A.S-2009)

Shri Kartikeya Misraశ్రీ. కార్తీకేయ మిశ్రా, I.A.S, కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ 2009 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐ.ఎ.ఎస్.) అధికారి.  ప్రతిష్టాత్మక బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలాని నుండి BE కంప్యూటర్ సైన్స్ నందు మరియు అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (PGDM) కోర్స్ నందు పట్టబద్రులైనారు.  విద్యాభ్యాసం అంతా గొప్ప పేరు గలిగిన విద్యా సంస్థలలో సాగినది మరియు గోల్డ్మ్యాన్ సాచ్స్, న్యూయార్క్ వంటి ఉత్తమ అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలలో కలిసి పనిచేసిన అనుభవం కలదు.  ఐ.ఎ.ఎస్. శిక్షణ పూర్తి చేసిన తరువాత తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించేముందు సబ్ కలెక్టర్ – పాడేరు, సబ్ కలెక్టర్ – బోధన్, ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ – ఆంధ్రప్రదేశ్ ఉత్తర పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ – ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ మరియు డైరెక్టర్ ఇండస్ట్రీస్, కేన్ కమీషనర్ మరియు సి.ఇ.ఓ. అఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్ వంటి వివిధ హోదాలలో పనిచేసినారు.

చరవాణి    : +91-884-2361300(R)
చరవాణి    : +91-884-2361200(O)
ఇమెయిల్ : collector_egd@ap.gov.in