Close

పిఠాపురం

కాకినాడ నుండి 20 కిలోమీటర్ల మరియు రాజమండ్రి నుండి 75 కిమీ దూరంలో ఉన్నది. ఇది భారతదేశంలో 18 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది కుక్కుటేశ్వర స్వామి, కుంతిమాధవ స్వామి, శ్రీ పాద శ్రీ వల్లభ అనాఘ దత్తాక్షేత్రం, అగ్రహరం, శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయాలకు ప్రసిద్ది చెందింది. మీరు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత, ప్రదక్షణ పూర్తి చేసి ద్వజ స్తంభం ముందు నిలబడి చుస్తే అత్యద్భుతంగా మలచబడిన ఏక రాతి నందీశ్వరుని విగ్రహం ప్రత్యేక్షమవుతుంది. ఇది లేపాక్షి బసవేశ్వర నందీశ్వరుని తర్వాత ఏక శిలా నందీశ్వరుని విగ్రహాలలో రెండవ స్థానంలో ఉంది.