Close

జిల్లా ముఖచిత్రం (District Profile)

1925 సంవత్సరంలో పాత గోదావరి జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లా వేరుచేయుబడిన తరువాత మిగిలిన భాగమే ఈ జిల్లా. తూర్పుగోదావరి జిల్లా పేరు గోదావరి నదితో సంబంధం కలిగిఉన్నది. ఎక్కువ డెల్టా ప్రాంతమును ఆక్రమించివున్నది.

జిల్లా యొక్క ప్రధాన శిబిరములన్ని కాకినాడలో వున్నవి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈశాన్య తీరప్రాంతములో తూర్పుగోదావరి జిల్లా వున్నది. ఉత్తర సరిహద్దుగా విశాఖ పట్టణం జిల్లా మరియు ఒరిస్సా రాష్ట్రము, తూర్పు మరియు దక్షిణ దిశలలో బంగాళాఖాతము మరియు పశ్చిమమున తెలంగాణా రాష్ట్రము యొక్క ఖమ్మం జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాను సరిహద్దులుగా కలిగి యున్నది.

క్రొత్తగా ఏర్పడిన ఏటపాక డివిజన్ తో సహా జిల్లా యొక్క విస్తీర్ణము 12,805 చ||కిమీ. ఈ జిల్లా 16 డిగ్రీల 30 సెంటిగ్రేడ్స్ మరియు 18 డిగ్రీల 20 సెంటిగ్రేడ్స్ ఉత్తర అక్షాంశాలు మరియు 81 డిగ్రీల 30 సెంటిగ్రేడ్స్ మరియు 82 డిగ్రీల 30 సెంటిగ్రేడ్స్ తూర్పు రేఖంశాముల మధ్య వున్నది. 2011 జనాభా లెక్కలు ప్రకారం ఈ జిల్లా 52.86 లక్షలు జనాభా కల్గివున్నది. ఈ జిల్లా 7 రెవిన్యూ డివిజన్లు, అనగా రాజమహేంద్రవరం, పెద్దాపురం, రంపచోడవరం, అమలాపురం, రామచంద్రాపురం మరియు ఏటపాక వున్నవి.

కల్లెక్టరేట్ భవనము, కాకినాడ

ఈ ఘనమైన చరిత్రాత్మిక భవనముకు హెచ్.యి. లార్డ్ అంప్ ధిల్ G.C.I.E మద్రాసు గవర్నర్ గారు ది 4.12.1903న శంఖుస్తాపన చేసిరి. 1906లో నియోక్లాసికల్ నిర్మాణ కళారీతిలో ఈ భవన నిర్మాణం జరిగినది. ఆర్ & బి శాఖ వారి రికార్డుల ప్రకారం ఈ భవనం నిర్మాణమునకు 1,59,832/- ఖర్చు అయినది. ఈ భవనము పునాది రాయి మరియు సున్నపు మిశ్రమముతో కట్టబడినది.

ఈ భవనము యొక్క పొడవు 85.34 మీ. ఎత్తు 9.5 మీ. మరియు భవన విస్తీరణము 19.53 చ.మీ. 1906 లోనే ఈ భవనముకు సంబంధించి ఆదనపు నిర్మాణములు జరిగినవి. రైతులు కొరకు 112 చ.మీ. విస్తీర్ణముతో రూ. 2,899/- ఖర్చుతో షెడ్డు నిర్మాణం మరియు రూ. 3,001 ఖర్చుతో గుర్రపుశాలలు నిర్మించబడినవి. ఈ భవన నిర్మాణ ప్రణాళిక, గదుల యొక్క లేఅవుట్, వాటి యొక్క విశాలత, గాలి వెలుతురు, ప్రసరణ, ఎత్తైన రూపురేఖలు అన్ని క్రియాత్మకమైనవి. స్తంభములతో కూడిన వరండాలు, స్తంభముల మధ్య రాళ్ళతో నిర్మించిన కేంద్రములో మూలరాయి కలిగిన అర్ధచంద్రాకార రాతి ఆర్చ్ లు, వీటి కేంద్రములో ఒక మూలరాయి కలిగి వుండడం ఈ బిల్డింగ్ యొక్క నిర్మాణ ప్రత్యేకతలు. రాళ్ళ మధ్య ధృడమైన బంధము, రాళ్ళ యొక్క కాఠీన్యము, లావైన రాళ్ళ కారణముగా భూకంములను సైతం ఎదుర్కొని నిలువగల సామర్ధ్యము ఈ భవనమునకు కలదు.