Close

జిల్లా పంచాయతీ కార్యాలయం

తూర్పు గోదావరి జిల్లాలో గ్రామా పంచాయతిల ముఖ చిత్రం :-

వీలిన మండలాలును కలుపుకొని 62 మండలాలు 1069 గ్రామా పంచాయతిలు కలిగిన జిల్లా తూర్పు గోదావరి జిల్లా . 779 సమూహా గ్రామపంచాయతీలు ముఖ్య కేంద్రంగా సుమారు 520 పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తూ ఉన్నారు.

గ్రామీణ ప్రజానీకానికి పౌర సదుపాయాలు కల్పనే ముఖ్య లక్ష్యంగా పంచాయతి రాజ్ శాఖ పనిచేస్తుంది.

పౌర సదుపాయాలు :-

పారిశుధ్యం, మంచినీటి / త్రాగునీటి సరఫరా , వీధి దీపాలు వంటి సదుపాయాలతో పాటు నిధుల లభ్యతకు తగ్గట్టుగా గ్రామం లోపల గ్రామం చుట్టుపక్కల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఈ శాఖ నిర్వర్తిస్తుంది. ఇవే కాకుండా జిల్లా పరిపాలన యంత్రాంగం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు అప్పగించే యన్.టి.ఆర్ భరోసా పించన్ల పంపిణి వంటి సామాజిక భద్రత పధకాల అమలు, ఐ యస్ ఎల్ నిర్మాణంలో పాలు పంచుకోవడం వంటి భాద్యతలను ఈ శాఖ నెరవేరుస్తుంది.

గ్రామపంచాయతీల ఆదాయ వనరులు

ఇళ్ళ పన్నులు, చేపల చెరువు లీజులు, వీధి మరియు సంత లా నుండి వచ్చే కిస్తీలు, ఆసీళ్లు , కట్టడాల మరియు స్థలముల పై వసూలు చేసే రుసుములు, కబేళ ల నుండి వచ్చే పనులు గ్రామపంచాయతీలకు ఆదాయన్ని సమకూర్చే వనరులు

అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకై రాష్ట్ర ప్రభుత్వం 14 వ ఆర్ధిక సంఘం వారు జారి చేసిన దిశా నిర్దేశాలకు అనుగుణంగా నిధులను గ్రామపంచాయతీలకు విడుదల చేస్తూ వస్తుంది.
2002 లో ప్రభుత్వం పంచాయతి కార్యదర్శి వ్యవస్థను ప్రవేశపెట్టింది. వారి విధి నిర్వహణ జాబితాను జి వో ఎం యస్ నెం 295 పి ఆర్ & ఆర్ ఓ 2007 నందు రూపొందించబడింది. పంచాయతి కార్యదర్శి పై తదుపరి ఉన్నతాధికారి ఎక్స్టెన్షన్ అధికారి పి ఆర్ & ఆర్ డి , చట్టాలు అందలి నియమ నిబంధనల కనుగుణంగా గ్రామపంచాయతీల పాలన జరిగేలా ఆయన చూసుకోవాల్సిఉంటుంది. ఈ అధికారి క్రమానుగత శ్రేణిలో తదుపరి పై అధికారి డివిజనల్ పంచాయతి అధికారి వారి పైన జిల్లా పంచాయతి అధికారి

ఈ అధికారులు నిర్ణీత కాల వ్యవధిలో గ్రామపంచాయతీల నిర్వహణ తీరుతెన్నులను తనిఖి చేస్తూ గ్రమపంచాయాతిల పాలనా సక్రమంగా సాగేటట్లు చూస్తూ ఉంటారు.

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే జన సామాన్యానికి పారిశుధ్యం, మంచినీటి / త్రాగునీటి సరఫరా , వీధి దీపాలు వంటి సదుపాయాలు కల్పించటానికి గ్రామపంచాయతీల ఆదాయ వనరులు పెంచుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుక్కను గ్రామపంచాయతీలు నీటి పారుదల పన్నుని , వీధి దీపాల పన్ను మరియు గ్రామా సరిహద్దులో నిలిపిన ప్రకటన బోర్డు లపై ప్రచార పన్ను విధించాల్సి ఉంది.

dpo

DPO, Dl.P.O. యొక్క సంప్రదింపు వివరాలు
క్రమ సంఖ్య
ప్రాంతము
అధికారి  హోదా
ల్యాండ్ లైన్ ఫోన్
మొబైల్ సంఖ్య
ఇమెయిల్
1 తూర్పు గోదావరి, కాకినాడ
జిల్లా పంచాయతీ అధికారి
0884-2379174 9849903185 dpo_pr_egd[at]ap[dot]gov[dot]in egdpokkd[at]gmail[dot]com
2
అమలాపురం
డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారి
08856 – 232629 9849903189 dlpoamalapuram[at]gmail[dot]com
3 కాకినాడ
డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారి
0884 – 2349519 9849903188 dlpo.kkd[at]gmail[dot]com
4
పెద్దాపురం
డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారి
08852 – 241063 9849903188 dlpopeddapuram[at]gmail[dot]com
5
రాజమహేంద్రవరం
డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారి
0883 -2465886 9849903186 dlporjy[at]gmail[dot]com
6
రంపచోడవరం
డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారి
9989461473 dlporcv[at]gmail[dot]com

ముఖ్యమైన అంతర్జాల అనుసంధానాలు

సెంట్రల్ లెవెల్ అప్లికేషన్స్ / పీఎస్ఎస్ అప్లికేషన్స్:

1) PRIA SOFT (accountingonline.gov.in)

గ్రామపంచాయతీల రాబాడి మరియు వ్యయాల వాటి రశీదులు స్వీకరించి నగదు పుస్తకం మరియు పట్టి పుస్తకం ల వివరములు తెలుపు అంతర్జాల అనుసంధానము

2) AREA PROFILER (areaprofiler.gov.in)

గ్రామపంచాయీతికి చెందిన సహజ వనరులు, సామాజిక, ఆర్ధిక వనరులు , మౌలిఖ నిర్మాణ సంభంధమైన బౌగోలిఖమైన మరియు ప్రజల జీవన స్థితిగతులు సంబంధాల వివరించే అంతర్జాల అనుసంధానము. దీనిలో ప్రజాప్రతినిధుల వివరాలతో పాటు, వివిధ విభాగాల కార్యక్రమాల ప్రణాళికల కోసం ఏర్పాటు చేయబడిన ముఖ్య సమాచార వనరు గా ఇది ఉపయోగపడుచున్నది

3) జిల్లా పంచాయతి పోర్టల్ (appr.gov.in)

గ్రామపంచాయతి యొక్క సమాచారం ప్రజల ముంగిట పంచుకోడానికి ఏర్పర్చిన క్రియాశీలకమైన అంతర్జాలము. ( గ్రామా సభ వివరములు , చిత్రాలు, టెండర్లు , తాజా కబుర్లు )

4 జాతీయా ఆస్తుల మార్గదర్శి (assetdirectory.gov.in)

నిర్మిస్తున్న / నిర్వహించుబడుచున్న స్థిర చరాస్తుల వివరాలును సంగ్రహిస్తూ జరిగెడి పనులలో అనవసరపు పునరావ్రతాన్ని నివారించటం లో సాయం చేస్తుంది

5) స్థానిక సంస్థల మార్గదర్శి (lgdirectory.gov.in)

ఈ అంతర్జాలము కొత్త రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు,కొత్త జిల్లాలు,కొత్త చిన్నజిల్లాలు, కొత్త గ్రామాలూ, కొత్తగా స్థానిక సంస్థల ఏర్పాటు చేయటానికి సంబందించిన వ్యవహారాలకు కేంద్ర, రాష్త్ర ప్రభుత్వ శాఖలచే వినియోగించాబడుచున్నది.

ఇది స్థానిక సంస్థలకు సంబందించిన అన్ని వివరాలు గ్రహించి వాటికీ ఏకైక స్మృతి సంఖ్యలను, చిహ్నాలను కేటాస్తుంది. ఇంకా పంచాయాతీలను రాష్ట్రా శాసనాసభ నియోజక వర్గం, లోక్ సభ నియోజక వర్గం వారిగా పటాలలో గుర్తిస్తుంది

6) ప్లాన్ ప్లస్ (planningonline.gov.in)

ఈ అంతర్జాలము పంచాయతీలకు , పట్టణ / నగర స్థానిక సంస్థలకు మరియు సంబంధిత శాఖలకు వార్షిక కార్యాచరణ, దృక్పదిత ప్రణాళిక తయారీలో సాయపడుతూ ఉంటుంది

7) పౌర నమోదు పద్ధతి (crsorg.gov.in)

దీనిలో పౌరుల జనన , మరణాల నమోదు మరియు వాటియొక్క ద్రువపత్రములు జారి చేయుటకు సంబందించిన కేంద్రీకృత సమాచార నిర్వహణా వివరాలను తెలియచేస్తుంది

8) PEAIS (panchayataward.gov.in)

రాష్ట్రాప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంత పాలిన యంత్రాంగంచే సిఫార్సు చేయబడిన ఉత్తమ పంచాయతీలకు ప్రోత్సాహకాలను భారత ప్రభుత్వపు పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ 2011-12 నుండి అందచేస్తూ వస్తుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 వ తేదిన జరిపే పంచాయతీరాజ్ దినోత్షవం రోజు ఈ అవార్డు అందచేయబడుచున్నది

1) మూడు అంచెల పంచాయతీ వ్యవస్థలో సాధారణ మరియు అంశిక విభాగాలలో పంచాయత్ సశక్తీకరణ్ పురస్కార్ అవార్డు

2) అత్యుతమ నిర్వహణ ప్రతిభను చూపిన గ్రామపంచాయతీలకు రాష్ట్రీయ గౌరవ గ్రామా సభ పురస్కారాని అందచేస్తారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం (MGNREGS) అమల్లో మంచి పురోగతి కనబరచిన గ్రమాపంచాయతీలకు MGNREGS అవార్డు అందచేస్తారు.

రాష్ట్ర స్థాయీ సంబందించిన అంశాలు

1) డిజిటల్ పంచాయతి

పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంచాలకులు వారు పంచాయతీలలో కంప్యుటీకరిణ మరియు పౌర కేంద్రిత పత్రాలను ఆన్ లైన్ జారీ చేసే ప్రక్రియకు డిజిటల్ పంచాయతి అనేడి ఓ ఫ్లాగ్ షిప్ G2C ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.

NIC వారిచే కులాంకుషంగా అధ్యయనం జరిపిన మీదుట , పంచాయత్ రాజ్ శాఖ, గ్రామపంచాయతీలకు అభ్యర్దన పత్రాలు స్వయం బాలకాం కావటానికి ప్రాధాన్యతను ఇచింది

అభ్యర్దన పత్రాలు ఏ యే రంగాలకు సంభందించినవంటి జనన మరణాల నమోదు, ఇంటి పన్ను వసూళ్ళు, వ్యాపార అనుమతులు, ఆస్థి మదింపు, మంచినీటి కుళాయీ కనెక్షన్ , నిరక్షపేణా పత్రాలు , కట్టడాల అనుమతులు , లే- అవుట్ అనుమతులు మరియు MGNREGS ఉపాధి కార్డు వంటి అభ్యర్దన పత్రాలు రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలకు అనుసంధానం చేసి సులభంగా జారి చేయబడతాయయీ.

ఈ సాఫ్ట్ వేర్ జారిపత్రాల వేలువరింతకు , పౌర చెల్లింపుల వేదికకు , పంచాయతీల విధి నిర్వహణకు ఈ-సైన్ , ఈ-మెయిల్,ఎస్ యం ఎస్ లు పంపటానికి వీలు కల్పిస్తుంది.

జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, గ్రామా పంచాయతీ లు గా ఉన్న మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలలో కంప్యుటీరికరిణ జరుగుతుంది.

పౌర కేంద్రిత పనులు జరిగే ప్రాంతాలు

1) ఇంటిపన్ను (mpanchayat.ap.gov.in)
దీనిలో ఇంటిపన్నులకు సంబందించిన అన్ని వివరాలు సంగ్రహించి డిమాండ్ నోటిసులు జారీ చేయటానికి , ఆన్ లైన్ చెల్లింపు రశీదులు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది

2) వ్యాపారా అనుమతులు (ట్రేడ్ లైసెన్స్)(mpanchayat.ap.gov.in)
దీనిలో అన్ని వ్యాపారాలకు సంబందించిన అన్ని వివరాలు సంగ్రహించి వ్యాపార అనుమతులు జారీ చేయటానికి , రెన్యువల్ చేయటానికి ఉపకరిస్తుంది

౩) ఆస్థి మదింపు పత్రం (mpanchayat.ap.gov.in)

ఇంటిపన్ను అభ్యర్దన పత్రం నుండి ఆస్థి వివరాలను సంగ్రహిస్తుంది ఇంకా ఆన్ లైన్ లో ఆస్థి మదింపు పత్రం వెలువరిస్తుంది

4) ఆస్థి బదలాయింపు పత్రం (mpanchayat.ap.gov.in)

ఇంటిపన్ను అభ్యర్దన పత్రం నుండి ఆస్థి వివరాలను సంగ్రహిస్తుంది ఇంకా ఆన్ లైన్ లో ఆస్థి బదలాయింపు పత్రం వెలువరిస్తుంది

5. మంచి నీటి కుళాయి అనుసంధానం (mpanchayat.ap.gov.in)
ఇంటి పన్ను అభ్యర్ధనా పత్రం నుండి వివరాలను సంగ్రహించి ఆన్ లైన్ ద్వారా మంచి నీటి కుళాయి అనుసంధాన ప్రక్రియ వ్యవహార పత్రాలను వెలువరిస్తుంది.

6. వివాహ నమోదు పత్రం (mpanchayat.ap.gov.in)
ఆన్ లైన్ ద్వారా వివాహ గుర్తింపు పత్రం వెలువరించటానికి ఉపకరిస్తుంది.

7. నిరక్షేపణా పత్రం (NOC) (mpanchayat.ap.gov.in)
ఏక గవాక్ష పద్ధతిన లేక జిల్లా DIC నుండి, citizen/firm నుండి అనుమతి కోరే చిన్న తరహా, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు నిరక్షేపణా పత్రాన్ని వెలువరించేందుకు ఈ జాలగూడు ఉపకరిస్తుంది.

8. కట్టడపు అనుమతులు (mpanchayat.ap.gov.in)
పౌరులకు ఆన్ లైన్ ద్వారా కట్టడపు అనుమతి వ్యవహార పత్రాలు వెలువరించటానికి ఉపకరిస్తుంది.

9. లే అవుట్ అనుమతులు (mpanchayat.ap.gov.in)
పౌరులకు ఆన్ లైన్ ద్వారా లే అవుట్ అనుమతి వ్యవహార పత్రాలు వెలువరించటానికి ఉపకరిస్తుంది.

10. ఉపాధి హామీ పత్రం
ఆన్ లైన్ ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పధకం ద్వారా వేతనం కోరే అభ్యర్ధులకు ఉపాధి పత్రం వెలువరించటానికి ఉపకరిస్తుంది.

11. పంచాయితీ వనరుల శీఘ్ర మదింపు
ఈ జాలగూడు పన్నుల, పన్నేతర ఆదాయ వివరాలు సంగ్రహించి రోజువారీ పన్ను వసూలు వివరాలు నమోదు చేస్తుంది.

12. ఈ – పంచాయితీ నిర్వహణా సమాచార వ్యవస్థ
డిజిటల్ పంచాయితీ జాలగూడు నందు లభ్యమయ్యే అన్ని సేవలకు సంబంధించిన RAPR అభ్యర్ధనా పత్రాల యొక్క MIS నివేదికలను అందచేస్తుంది.

II. పంచాయితీరాజ్ సంస్థల నిర్వహణా వ్యవస్థ (PRIMS) (prim.ap.gov.in)
కూడిక సభా నివేదికలు, పంచాయితీ వనరుల శీఘ్ర మదింపు అన్వేషణా నివేదికలు, పంచాయితీ కార్యాలయ భవన విచారణా నివేదికలు, 7 రకాల అమరికల్లో నుండే వార్షిక కార్యాచరణ ప్రణాళికలు తాగునీటి, పారిశుధ్య నివేదికలు వీటన్నింటికి సంబంధించిన వివరాలు సంగ్రహిస్తుంది.

III. ఏకీకృత జనన మరణ వివరాల నమోదు (UBD) (ubd.ap.gov.in:8080/UBD)
గ్రామ పంచాయితీలో నివసించే ప్రజల జనన, మరణ వివరాలు సంగ్రహించి మీ సేవా కేంద్రాల ద్వారా జనన, మరణ ధ్రువ పత్రాలు అందచేయటానికి ఉపకరిస్తుంది.